Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్Bhuma Akhila: మంగళగిరి మహాశక్తి చైతన్య రథయాత్రలో భూమా అఖిలప్రియ

Bhuma Akhila: మంగళగిరి మహాశక్తి చైతన్య రథయాత్రలో భూమా అఖిలప్రియ

ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి టిడిపి పథకాలను ఊదరగొడతారు

మంగళగిరి సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మహాశక్తి చైతన్య రథయాత్రను టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చం నాయుడు పాటు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. అనంతరం మహాశక్తి చైతన్య రథయాత్రను జండా ఊపి ప్రారంభించారు. మహానాడులో నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తిరుగుతూ ప్రజలకు టిడిపి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ అవగాహన కల్పించడం కోసం ఈ మహాశక్తి కార్యక్రమం చేపట్టారు. భూమా అఖిలప్రియతో పాటు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ పసల భారతీయాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శనివారం నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad