Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Bhuma Akhila: అన్నింటికి తెగించి రాజకీయాల్లోకొచ్చా

Bhuma Akhila: అన్నింటికి తెగించి రాజకీయాల్లోకొచ్చా

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత

దొర్నిపాడు మండలం భాగ్యనగర్ గ్రామంలో బుధవారం సాయంత్రం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెళుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పట్టణంలోని చింతకుంట్ల గ్రామ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు వేసుకుంది. దొర్నిపాడు మండలంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గడప గడపకు కార్యక్రమంలో పర్యటిస్తుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు మాజీ మంత్రి అఖిలప్రియ ప్రయాణిస్తున్న కారును నిలిపివేయడంతో ఆమె పోలీసులతో తనకు ముందు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని వాగ్వాదానికి దిగింది. దీంతో నడిరోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ భూమా జగత్ విఖ్వాత్ రెడ్డితోీ కలిసి మీడియా సమావేశంలో నిర్వహించారు.

- Advertisement -

బుధవారం సాయంత్రం భాగ్యనగరం గ్రామంలో తన పర్యటనను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు భావించినప్పుడు తనకు ముందుగా నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. తన పర్యటన గురించి రెండు రోజుల ముందుగానే సమాచారం ఇచ్చానని, కానీ ఈరోజు కుట్రపూరితంగా తాను భాగ్యనగరం గ్రామంలో పర్యటించ రాదని పోలీసుల అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని మాజీ మంత్రి ప్రశ్నించారు. తనకు ముందుగా నోటీసు ఇచ్చి ఉంటే ఇంకా ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. పోలీస్ శాఖ అధికారులు తనను ఇబ్బంది పెట్టినా పట్టించుకోనని.. అదే తమ అనుచరులు, గ్రామ నాయకులను ఇబ్బంది పెడితే మాత్రం సహించేది మాజీ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు.

అన్నింటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. ఇప్పటినుండి స్థానిక ఎమ్మెల్యే ఏ గ్రామానికి వెళితే తాను అదే గ్రామానికి వెళ్లి మీటింగులు పెడతానని అఖిలప్రియ పేర్కొన్నారు. కౌన్సిలర్ హుస్సేన్ భాష, సిద్ధి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి చాంద్బాషా నన్నే బాయ్ గారి జిలాని, నాగిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి, బీరువాలభాస్కర్, టిడిపి నాయకులు కార్యకర్తలు, భూమా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News