Sunday, September 29, 2024
Homeపాలిటిక్స్Bhuma Akhila: రైతుల కష్టాలు పట్టవా

Bhuma Akhila: రైతుల కష్టాలు పట్టవా

కమీషన్లు, పర్సెంటేజీలు తప్ప రైతుల గోడు ఎమ్మెల్యేకు పట్టదా?

రైతులకు సాగునీరు విడుదల చేయకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాంమంటూ భూమా అఖిలప్రియ హెచ్చరించారు, రుద్రవరం మండల పరిధిలోని తెలుగంగ ప్రధాన కాలువ అలాగే 16 బ్లాక్ ఛానల్ నుండి 21వ బ్లాక్ ఛానల్ వరకు ఆమె పరిశీలించారు. అనంతరం గుట్టకొండ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాలువను పరిశీలిస్తూ సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతులతో పాటు తమ పార్టీ సీనియర్ నాయకుల సలహాలు తీసుకున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే రైతే రాజు అవుతాడని రైతులు ఆనందంగా జీవిస్తారని చెప్పిన వైసీపీ నాయకులు ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు ఇబ్బందులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

- Advertisement -

అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కమిషన్లు పర్సంటేజీలకు కకృతి పడుతూ రైతాంగాన్ని గాలికి వదిలేస్తున్నారని రైతుల కోసం వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకునే వైసిపి నాయకులు రైతుల గోడు పట్టించుకోవడంలేదని విమర్శించారు. విచిత్రంగా రాష్ట్రంలో వర్షాలు పడుతూ భూగర్భజాలు పెరుగుతున్నాయని ఆళ్లగడ్డ పరిధిలో మాత్రం అంతంత మాత్రమే వర్షాలు పడటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని దీంతో తెలుగు గంగ, కెసీ కెనాల్ ఆధారంగా పంటలు సాగు చేసే రైతులు సాగునీరు లేక తీవ్రంగా నష్టపోతున్నారని అధికారులు ఎమ్మెల్యే స్పందించి రైతులకు సాగునీరు విడుదల చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

పనులు బంధువులకు వైసీపీ నాయకులకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని వారి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నా సరే పనులు నాణ్యవంతంగా సకాలంలో పూర్తిచేసే కాంట్రాక్టర్లకు అప్పగిస్తే బాగుంటుందని గంగ పనులు చేపట్టేందుకు దాదాపు 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించామని ఎమ్మెల్యే గొప్పలు చెప్తున్నారే కానీ ఆ నిధులు ఎక్కడ పెట్టారో ఏం చేశారు ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే నే అటు రైతులు ఇటు ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోవడంలేదని మళ్లీ కొత్తగా సలహాదారు పదవి చేపట్టి ఆళ్లగడ్డను ఏం ఉద్ధరిస్తారని విమర్శించారు. ఎమ్మెల్యేకు ఎంతసేపు కమిషన్లు కబ్జాలు రౌడీయిజం తప్పుడు కేసులు పెడుతూ బిజీగా ఆనందం పొందుతున్నాడే తప్ప ఆళ్లగడ్డ అభివృద్ధి కాంక్షించడం లేదని విమర్శించారు. రుద్రవరం మండలం సొంత మండలం అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సొంత ఊరు యర్రగుడిదిన్నె రైతులకు సాగునీరు అందించే బ్లాక్ ఛానల్ అధ్వానంగా ఉందని ఈ బ్లాక్ ఛానల్ మరమ్మతులు చేయించకుండా రైతులకు సాగునీరు ఎలా అందిస్తాడని ప్రశ్నించారు. సాగునీటి విడుదలపై అధికారులు ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి రైతులకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఎమ్మెల్యే ఉన్నాడని విమర్శించారు. రెండు మూడు రోజుల్లో రైతులకు సాగునీరు విడుదల చేయకుంటే నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని రైతులతో కలిసి భారీ ఎత్తున ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. రుద్రవరం మండలంలో గతంలో భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే సలహాదారుడు చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు. సలహాదారుడు అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ ఫీల్డ్ లో తిరిగి పరిశీలించి సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఎక్కడో ఒకచోట కూర్చుని ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. రుద్రవరం మండలంలో ప్రధానంగా కోటకొండ శ్రీరంగాపురం డి కొట్టాల పలు గ్రామాల పరిధిలో పిల్ల కాలువలు లేకపోవడంతో రైతులు పిల్ల కాలువలు ఏర్పాటు చేసి పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని ఇప్పటికైనా ఎమ్మెల్యే సలహాదారుడు వైసీపీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆమె వెంట చింతకుంట్ల జాఫర్ రెడ్డి, బోయలకుంట్ల శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఎర్రం ప్రతాపరెడ్డి, ఎల్వి రంగనాయకుల శెట్టి, రామసుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, సిరివెళ్ల రామ, సత్యం రాజు, లక్ష్మీకాంత్ యాదవ్, బండారు బాలరాజు, పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News