Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Shock to BJP: సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి భారీ షాక్

Shock to BJP: సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి భారీ షాక్

బీఆర్ఎస్ లోకి బీజేపీ మైనారిటీ నేతలు

సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో చేరారు.

- Advertisement -

హైదరాబాదులో బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు తమ అనుచరులతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సమక్షంలో దాదాపు 60 మంది బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.

ముస్లిం మైనారిటీలకు బీఆర్ఎస్ రక్షణ కల్పిస్తుంది. బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు.. మాట్లాడుతూ.. జిల్లాలోని సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గ వర్గాలలోని అన్నీ మండలాల నుంచి మైనారిటీ మోర్చా మండల అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు, అంతా ఓకేతాటిపైకొచ్చి ఏకమై బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నామని తెలిపారు.


బీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానీకానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎనలేని కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరుగుతున్నాయని, సాధ్యం చేసి నిరూపిస్తున్నారని నయిమోద్దీన్ చెప్పారు. బీఆర్ఎస్ ముస్లింలకు రక్షణ కల్పిస్తుందని, చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని షాదీ ముబారక్, మైనారిటీలకు లక్ష బంధు సాయం, ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి నాయకుడు, నిత్యం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పరితపించే ప్రజా నాయకుడు హరీశ్ రావు పట్ల బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు తెలిపారు. మంత్రి హరీశ్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ చేరిన వారిలో.. మహ్మద్ నయిమోద్దీన్-బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్, మహ్మద్ ఖలీల్-బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి, ఫర్జానా బేగం-బీజేపీ జిల్లా మైనారిటీ మహిళా మోర్చా ప్రెసిడెంట్, మహ్మద్ యాసీన్-బీజేపీ సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్, మహ్మద్ ముస్తాఫా-బీజేపీ దుబ్బాక మండల మైనారిటీ ప్రెసిడెంట్, మహ్మద్ ముస్తాఫా-బీజేపీ దుబ్బాక మండల వైస్ ప్రెసిడెంట్, మహ్మద్ రజాక్-బీజేపీ జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్, మహ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్- బీజేపీ టౌన్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్, మహ్మద్ షాకేర్- బీజేపీ టౌన్ మైనారిటీ సెల్ కార్యవర్గ సభ్యుడు, అద్నాన్-బీజేపీ టౌన్ క్రియాశీలక కార్యకర్తలు, గోరేమియా, బీజేపీ మైనారిటీ చేర్యాల టౌన్ ప్రెసిడెంట్-మహ్మద్ కరిమోద్దీన్, చేర్యాల బీజేపీ మైనారిటీ నాయకులు సమీర్, పెద్ద షాదుల్లా, చిన్న షాదుల్లా, ఏండీ.సాజిద్, మహ్మద్ రహీం, ఖలీల్, షకీల్, బీజేపీ మైనారిటీ నాయకులు ఆర్షద్ హుస్సేన్, గౌస్, జానేమియా, సలా ఉద్దీన్, అబూ బకర్, షాహీద్, అజీజ్, గోరేమియా, షరీఫ్ అహ్మద్, దుబ్బాక మండల బీజేపీ మైనారిటీ ప్రెసిడెంట్ ఏం.డీ.ముస్తఫా, వైస్ ప్రెసిడెంట్ ముస్తాఫా తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో.. మంత్రితో పాటు సిద్ధిపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జావేద్, అహ్మద్, దర్పల్లి శ్రీనివాస్, చాంద్, మజర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News