Thursday, November 21, 2024
Homeపాలిటిక్స్Bihar: క్యాస్ట్ సెన్సస్ స్టార్ట్

Bihar: క్యాస్ట్ సెన్సస్ స్టార్ట్

బిహార్ లో కులగణన నేటితో ప్రారంభమైంది. రెండు దశల్లో క్యాస్ట్ సెన్సస్ ను పూర్తి చేయనున్నట్టు సీఎం నితీష్ కుమార్ చెబుతున్నారు. మొదటి దశ ఈనెల 21కి పూర్తి కానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గడపకు సెన్సస్ టీం వెళ్లనుంది. అణగారిన వర్గాలకు అందించాల్సిన సాయం మరింత సులువు అయ్యేలా ఈ కుల గణన పనికొస్తుందని సీఎం నితీష్ చెబుతున్నారు. ఈ రిపోర్టును కేంద్రానికి కూడా బిహార్ సర్కారు పంపించనుంది. సమాధాన్ యాత్రలో బిజీగా ఉన్న నితీష్ క్యాస్ట్ సెన్సస్ అంశాన్ని తాను పోయినచోటల్లా వివరిస్తున్నారు. ‘జాతి ఆధారిత్ గణన’తో రాష్ట్రంలోని కుల, మతాల వివరాలు కచ్ఛితమైన లెక్కలతో తేలనున్నాయి. ఈ సెన్సస్ లో భాగంగా ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా తప్పకుండా సేకరించి, అధికారికంగా నమోదు చేయనున్నారు. మే 2023కల్లా ఈ మొత్తం ప్రహసనం పూర్తి కానుంది. ఇందుకు 500 కోట్ల రూపాయల నిధులను బిహార్ సర్కార్ వెచ్చించనుంది. ఇదంతా డిజిటల్ రూపంలో సేకరించేందుకు మొబైల్ అప్లికేషన్ ను సర్వేలో ప్రయోగించనున్నారు. క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కోసం ఎప్పటినుంచో దేశవ్యాప్తంగా వాదోపవాదనలు సాగుతుండగా బిహార్ రాజకీయాల్లో ఇది అత్యంత కీలకమైన అంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News