Bihar Elections Owaisi Pappu Yadav : బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ 20 జిల్లాల్లో 122 స్థానాల్లో 1,302 అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 60.40% ఓటింగ్ నమోదైంది. తొలి దశలో 64.49% రికార్డు సృష్టించినప్పటికీ, ఈ దశలో కూడా 65% మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం, కిషన్‌గంజ్‌లో 51.86% అత్యధికంగా నమోదుకాగా, గయ, జమూయి, బంకాలో 50% మించిపోయింది. తూర్పు, పశ్చిమ చంపారన్, పూర్నియా, కతిహార్‌లో 48%కి పైగా పోలింగ్ జరిగింది.
ALSO READ: Murder: భీమవరంలో దారుణం: తల్లి, సోదరుడిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
ఉదయం 9 గంటలకే 15% ఓటింగ్ కాగా సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ కొనసాగుతుంది.
ఈ భారీ ఓటింగ్ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను పెంచింది. ఎన్‌డీఏ (బీజేపీ-జేడీయూ) పాలన మద్దతుగా చూస్తుంటే, మహాగఠబంధన్ (ఆర్‌జేడీ-కాంగ్రెస్) భవిష్యత్తును రక్షించుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో 12 మంది మంత్రులు ఈ దశలో పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో లేకపోయినా, తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సిన కీలక నేతలకు ఈ దశ అగ్నిపరీక్షగా మారింది అందులో అసదుద్దీన్ ఓవైసీ, పప్పు యాదవ్, ఉపేంద్ర కుష్వాహా, జీతన్‌రామ్ మాంఝీలకు ప్రత్యేకంగా సవాలు ఎదురైంది.
సీమాంచల్‌లో ఓవైసీకి – 2020లో AIMIM 5 సీట్లు గెలిచి సంచలనం సృష్టించింది. కానీ, 4 మంది ఎమ్మెల్యేలు ఆర్‌జేడీలో చేరారు. ఈసారి 25 సీట్లలో 17 రెండో దశలో (సీమాంచలో 15) ఉన్నాయి. ముస్లిం ఓట్లపై ఓవైసీ ప్రభావం ఎంతో తేలనుంది. కాంగ్రెస్, SP అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గెలవలేకపోతే ఇక్కడ రాజకీయాల్లో ఓవైసీ స్థానం దెబ్బతింటుంది.
పప్పు యాదవ్ ప్రతిష్ఠకే సవాల్ – పూర్ణియా MP పప్పు యాదవ్ సీమాంచలో కాంగ్రెస్ కీలక నాయకుడు. అతను నేరుగా పోటీ చేయనప్పటికీ పూర్ణియా, సుపౌల్, అరారియాలో అభ్యర్థులను పోటీలో నిలిపారు. రాహుల్, ప్రియాంక గాంధీలకు సన్నిహితుడైన ఆయన స్థానం ఈ ఎన్నికల్లో పటిష్ఠం కావటం ఎంతో ముఖ్యం.
కుష్వాహాకి తప్పని పోటీ – RLM అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా 6 సీట్లలో 4 రెండో దశలోనే ఉన్నాయి. సాసారం (భార్య స్నేహలత), మధుబని, బాజ్‌పట్టి, టికారీలో పోటీలో ఉన్నారు. 2024 లోక్‌సభలో ఓడిన ఆయన ఈసారి ఎన్‌డీఏలో తన బలం చాటటం ఎంతో ముఖ్యం.
మాంఝీకి అగ్నిపరీక్ష – హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జీతన్‌రామ్ మాంఝీ 6 సీట్లు అన్నీ రెండో దశలోనే ఉన్నాయి. ఇమామ్‌గంజ్ (కోడలు దీపా), బారాచట్టి (కోడలి తల్లి జ్యోతి)తో పాటు మిగిలినవి పోటీ పడుతున్నాయి. మాంఝీ స్థానం ఈ గెలుపులపై ఆధారపడి ఉంది.


