Rahul Gandhi| కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్‌లో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)ని రాహుల్ గాంధీ అగౌరవపరిచారని బీజేపీ నేత అమిత్ మాల్వియా మండిపడ్డారు. అలాగే జాతీయ గీతాలాపన సమయంలో కూడా సరిగా ప్రవర్తించలేదని ఫైర్ అయ్యారు. ఈమేరకు సోషల్ మీడియాలో రెండు వీడియోలను షేర్ చేశారు.
ఓ వీడియోలో జాతీయ గీతం అలాపన సమయంలో పక్కచూపులు చూస్తున్నట్లు ఉన్నారు. అలాగే అలాపన ముగియగానే వేదిక నుంచి దిగిపోయేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. మరో వీడియోలో ఇతర నేతలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని పలకరిస్తుండగా.. ఆయన ఆమెను పలకిరంచకుండా వేదిక మీద నుంచి వెళ్లిపోయారు.
రాహుల్ గాంధీ 50 సెకన్లు కూడా ఓపిక పట్టలేరని విమర్శించారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును పలకరించడానికి ఆయనకు సమయం లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పట్టించుకోదు అనడానికి ఇదే నిదర్శనం అని ఆరోపించారు.