Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నద్దాకు ఎక్స్టెన్షన్

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నద్దాకు ఎక్స్టెన్షన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా.. జేపీ నద్దాకు ఎక్స్ టెన్షన్ లభించింది. దీంతో 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికలు జేపీ నద్దా ఆధ్వర్యంలోనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగనుంది.

- Advertisement -

ఈనెలతో నద్దా అధ్యక్ష పదవీకాలం ముగుస్తుంది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ భేటీ ఈమేరకు బీజేపీ తీర్మానం చేసింది. అటు సంఘ్ పరివార్ తో అటు మోడీ-షాతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతూ ఉన్న నద్దా వంటి వారు పార్టీలో పెద్దగా మరొకరు కనిపించటం లేదు. వివాదాస్పదమైన వ్యక్తి కాకపోవటం, మిత భాషి కావటం, సీజన్డ్ పొలిటీషియన్ గా, ఆర్గనైజేషన్ లో కమిటెడ్ గా కష్టపడే తత్వమున్న వ్యక్తిగా నద్దాకు మంచి ఇమేజ్ ఉంది.

కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, మేఘాలయ, మిజోరం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ముందు కొత్తగా ఎవరికి పార్టీ పగ్గాలు ఇచ్చినా వారు పార్టీ వ్యవహారాల నిర్వహణకు అలవాటు పడేందుకు ఎక్కువ సమయం కావాల్సి వస్తుంది. ఈనేపథ్యంలో ఎన్నికలకు సన్నద్ధతపై దాని దుష్ప్రభావం ఎక్కువగా పడుతుంది. పైగా ఏదో ఒక మ్యాజిక్ చేసి ఎలాగోలా హ్యాట్రిక్ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న మోడీ-షా ఇటు అసెంబ్లీ అటు లోక్సభ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలనే స్పష్టతతో చాలా దూకుడు చూపుతున్నారు. ఈనేపథ్యంలో నద్దానే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News