కొండారెడ్డి పల్లి గ్రామం, కొడంగల్ టౌన్ లో BRS పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ ఛైర్మన్, BRS పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి. ప్రజలంతా తమవైపే ఉన్నారని, BRS పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, తను నివాసం ఉండే గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని అతను ఎటువంటి అభివృద్ధి గురించి పట్టించుకోలేదని కానీ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతీ గల్లి కి రోడ్లు వేయించారని, అలాగే ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల సౌకర్యం కల్పించారని, రోడ్డు పనులు కొన్ని చోట్ల అసంపూర్తిగా జరిగి ఉన్నాయని, మరిన్ని రోడ్లు మా గ్రామంలో వేయాలని గ్రామస్తులు కోరినట్లు, గ్రామస్తులంతా అత్యధిక సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నరేందర్ రెడ్డిని ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రి గా చేసుకుని, మరిన్ని అభివృద్ధి పనులు గ్రామంలో చేసుకుంటామని తెలిపారని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ ఛైర్మన్, పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నామని, మానిఫెస్టోలో కొత్త పథకాలు పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని వారు తెలిపారు.