ఎన్నికల కోసం బీజేపీ నేతలు పేపర్ లీకేజీ వంటి పలు కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. లీకేజీకి పాల్పడ్డ బండి సంజయ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయపై తక్షణమే లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి అజయ్. బీజేపీ, కాంగ్రెస్ ల కారణంగా రాష్ట్రం భ్రష్టు పడుతోందని, ఇలాంటి పార్టీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అజయ్ పిలుపునిచ్చారు.
కాగా ఇదంతా పైశాచిక కుట్రతో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. రాహుల్ పై రెండు రోజుల్లో చర్యలు తీసుకున్న స్పీకర్, సంజయ్ లాంటి నేతల గురించి ఆలోచించాలని సండ్ర ఘాటుగా వ్యాఖ్యానించారు. సంజయ్ ని బీజేపీ అధ్యక్షుడుగా కొనసాగించాలా లేదో కూడా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
బండి సంజయ్ ఎంపీగా కొనసాగేందుకు అనర్హుడంటూ ఎమ్మెల్సీ తాత మధు మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మధు డిమాండ్ చేశారు.