Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్BRS fire on Bandi: పేపర్ లీకేజెస్.. బీజేపీ రాజకీయ ఆటే, తేల్చేసిన బీఆర్ఎస్

BRS fire on Bandi: పేపర్ లీకేజెస్.. బీజేపీ రాజకీయ ఆటే, తేల్చేసిన బీఆర్ఎస్

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆటలు మొదలు పెట్టిందని, పేపరు లీకేజీ అందులో భాగమేనంటూ బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది.  బీజేపీ నేతలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారంటూ,

- Advertisement -

కెసిఆర్ ను ఎదుర్కునే దమ్ము లేక విద్యార్థులు, వారి తల్లి దండ్రులను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ తాజాగా ఆరోపించింది.  3వ తేదీ సాయంత్రం సంజయ్ ప్రశాంత్ కు ఫోన్ చేసి ప్రశ్నాపత్రాలు లీక్ కావాలని చెబుతారని, కమలాపూర్ లో 9.45 కు ప్రశ్న పత్రాలు ఫోటోలు తీశారని, సంజయ్ అదేశాలతోనే బీజేపీ కార్యకర్తలు  ప్రశ్న పాత్రలు లీక్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలంతా ముక్తకంఠంతో మాటల దాడికి దిగారు.

విద్యార్థులు మనసులను గాయపరిచే విధంగా కుట్రలు పన్నుతున్న సంజయ్ పై పిడీ యాక్ట్ పెట్టాల్సిందేనని, వికారాబాద్ లో బీజేపీ అనుబంధ సంఘం ఉపాధ్యాయులు పేపర్ బయటకు వచ్చేలా చేశారని, బీజేపీ అనుబంధ సంఘాలన్నీ ఈ కుట్రలో భాగమేనని అధికార పార్టీ ప్రత్యారోపణలు జోరుగా చేస్తోంది. 

ఈమేరకు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, మంత్రి కొప్పుల ఈశ్వర్, గొంగిడి సునీతా మీడియాతో మాట్లాడారు.  లీక్ నిందితులకు బీజేపీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వీరు ఫోటోలు చూపించారు.  పేపర్ లీక్ అంతా పెద్ద కుట్రని, బీజేపీ అగ్రనేతల  కనుసన్నుల్లో జరుగుతోందంటూ వీరు ఆరోపించారు. 

రాష్ట్రంలో అలజడి తరువాత కీలక నేతలు పర్యటిస్తున్నారని.. గతంలోనూ ఇలాగే ప్రధాని, అమిత్ షా పర్యటనల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చిందనేది వీరి తాజా వాదన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News