Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్BRS fire on CM Revanth: అసెంబ్లీ లోపల, బయట మాట్లాడనివ్వట్లేదు

BRS fire on CM Revanth: అసెంబ్లీ లోపల, బయట మాట్లాడనివ్వట్లేదు

కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అంటూ నినాదాలు

ఆసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీ ఆర్ ఏస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ..ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని నిరసనకు దిగిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ..కంచెలు తొలగిస్తామని అసెంబ్లీలో ఇవేమి కంచెలని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. శాసన సభా పక్ష కార్యాలయాలున్న సమీపంలో నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

- Advertisement -

ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ..కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అని నినాదాలు చేసిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు ..అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరా అని నినదించారు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో అసెంబ్లీ ఆవరణలోనే బైఠాయించిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News