ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన బి ఆర్ యస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి. రాజీనామాలకు ఆమోదం తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
బి ఆర్ యస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి లు తమ ఎమ్మెల్సీ పదవులకు నేడు రాజీనామా చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని చైర్మన్ ఛాంబర్ లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు.
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలకు ఆమోదం తెలిపారు.