Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్BRS MP candidates list: బీఆర్ఎస్ తరపున లోక్ సభ బరిలో ఉన్న 17...

BRS MP candidates list: బీఆర్ఎస్ తరపున లోక్ సభ బరిలో ఉన్న 17 మంది వీరే

త్వరలోనే కేసీఆర్ ప్రచార కార్యక్రమాలు

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది.

- Advertisement -

ప్రజాబలం వున్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. లిస్టు ప్రకటన తోనే ఒక విశ్వాసం నెలకొనడం గమనార్హం.
ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తుకుచేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది సర్వత్రా వ్యాపిస్తున్నది.
ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్ దీవెనలతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకుపోనున్నారు.
కాగా ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజల్లోంచి అనూహ్యమద్దతు లభిస్తుండడం గమనార్హం.

పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులు అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో విస్తృత ప్రచారాన్ని చేపట్టి ప్రజల ఆదరణను పొందేందుకు సమాయత్తమైతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టనున్నారు.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News