ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సిఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం 9.45 కు వీరంతా ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వీరిని తొడుకొని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సందర్శన కు ప్రగతి నుండి సిఎం బయలు దేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రులు , అగ్ర నేతలు రెండు హెలికాప్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు .
హెలిపాడ్ నుండి అగ్రనేతలు తొలుత ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి చేరుకుని దర్శనం పూర్తి చేసుకున్నారు.