Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Cabinet decisions: వరద తక్షణ సాయంగా 500 కోట్ల విడుదల

Cabinet decisions: వరద తక్షణ సాయంగా 500 కోట్ల విడుదల

గోవా తరహాలో హైదరాబాద్ కు రెండో ఎయిర్ పోర్ట్

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించినట్టు, తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందని కేటీఆర్ తెలిపారు. రోడ్లకు తక్షణం మరమ్మతులు, విద్యుత్ వీరులకు 15 ఆగస్టున సత్కారం చేయనున్నట్టు కేటీఆర్ వివరించారు. టీఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పిన ఆయన.. ప్రజా రవాణాను పటిష్టపరిచేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు, దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టు తెలిపారు.

- Advertisement -

ఆర్టీసీ విలీనంపై క్యాబినెట్ సబ్ కమిటీ నియమిస్తున్నట్టు, 3న జరిగే శాసన సభలో ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించటం విశేషం. హైదరాబాద్ కీలక రూట్లలో మెట్రో విస్తరించాలని నిర్ణయించింది కేబినెట్ మీటింగ్. మూడు నాలుగేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయంచటం ఇందులోని ప్రత్యేకత. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలులో తిరిగి తీర్మానం చేసి పంపుతామని, రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల ను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేశారు.. వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని మంత్రి మండలి నిర్ణయించింది.

హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉందన్న కేటీఆర్.. హైదరాబాద్ లో హాకీంపేట ఎయిర్పోర్ట్ ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధిపై క్యాబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకోవటం హైలైట్.

వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. పంట నష్టంపై పూర్తి నివేదిక అందాక నిర్ణయం తీసుకోనున్నట్టు, కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలని మీటింగ్ లో పేర్కొన్నట్టు మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News