తెలంగాణాలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, కేసీఆర్ మూడవ సారి సీఎం అవుతున్నాని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీపీసీసీ మాజీ సభ్యులు, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు చామల ఉదయ్‌చందర్‌రెడ్డి మంగళవారం హైదరాాద్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర ఇన్‌చార్జ్ కల్వకుంట వంశీధర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా చామల ఉదయ్‌చందర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ గులాభికండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఆలేరులో గులాభి జెండా ఎగురబోతుందన్నారు. మూడవసారి గొంగిడి సునిత గెలుస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతారన్నారు. కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలను, చేస్తున్న అభివృద్ధిని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చలు పెట్టాలని సూచించారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని, కేసీఆర్‌ను ప్రజలు ఆ«ధరిస్తున్నారని వెల్లఢించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన చామల ఉదయ్ చందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కోన్నారు. పార్టీలో చేరిన వారిలో దాతారుపల్లికి చెందిన తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్వేష్, మోటకొండూర్‌కు చెందిన చామల భానుచందర్‌రెడ్డి, దాతారుపల్లికి చెందిన ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ భానుచందర్, గౌరాయపల్లికి చెందిన వడ్లకొండ శ్రీకాంత్, చాడకు చెందిన కూరేళ్ళ నరేష్‌గౌడ్, నాంచారిపేటకు చెందిన గంధమల్ల కరుణాకర్, ఆత్మకూరు(ఎం)కు చెందిన తిరునగరి ఫణిందర్, కొండాపూర్‌కు చెందిన కొప్పుల నర్సిరెడ్డి, రుస్తాపూర్‌కు చెందిన కొండపురం శ్రీహరి, శ్రీకాంత్, తేరాలకు చెందిన చామల మేఘారెడ్డి, రాఘావపురంకు చెందిన భగవంత్‌రెడ్డిలు ఉన్నారు.
KTR: బీఆర్‌ఎస్‌లోకి చామల ఉదయ్‌చందర్‌రెడ్డి
పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్