Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Erasu in race: శ్రీశైలం టిడిపి అభ్యర్థి రేసులో.. ఏరాసు

Erasu in race: శ్రీశైలం టిడిపి అభ్యర్థి రేసులో.. ఏరాసు

బుడ్డాపై నమ్మకం లేక ఏరాసును పిలిచిన బాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం కు ప్రత్యేక స్థానం ఉండేది. ఈ నియోజకవర్గము నుంచి ప్రతి సాధారణ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కాంటంగా ఉండేది. ఎందుకంటే ఈ నియోజకవర్గ పరిధి లో ఎక్కువ గా నల్లమల్ల అడవులు సంచరించుకోవడంతోపాటు, నక్సలైట్లకు, దేవాలయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ నియోజకవర్గం ఉండేది. ఆత్మకూరు నియోజకవర్గం 1978 లో ఆత్మకూరు, వెలుగోడు, గడివేముల, పాములపాడు, కొత్తపల్లి, శ్రీశైలం మండలాలతో కలిగి ఉండేది. మొదటి ఎమ్మెల్యేగా ఏ. వెంగళరెడ్డి పనిచేశారు. అదేవిధంగా 1983లో కాంగ్రెస్ నుంచి, 1985,1989 లో టిడిపి నుంచి వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించడంతోపాటు తన కంచుకోటగా ఆత్మకూరు నియోజకవర్గం ను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్న సమయంలో నే ఆత్మకూరు గ్రామపంచాయతీని 30 ఏళ్లగా పరిపాలిస్తున్న హుస్సేన్ సాహెబ్ ను దారుణంగా హత్య చేపించడంతో 1994లో జరిగిన సాధారణ ఎన్నికలలో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి పై ఓటమి పాలయ్యారు. అదేవిధంగా వేంపెంట మరణ హత్యల సంఘటనలు, పీపుల్స్ వార్ తో విభేదాలు ఒంటి సంఘటనలు ఒకవైపు , మరోవైపు 1999 జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని అంశంపై టిడిపి నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇది అదునుగా భావించి నక్సలైట్లు జిల్లాస్థాయి పోలీస్ అధికారులు అంటూ ఆత్మకూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోకి వెళ్లి అక్కడే ఉన్న బుడ్డా వెంగల్ రెడ్డి ని అతి కిరాతకంగా కాల్చివేశారు.

- Advertisement -

సెంటిమెంటుతో గెలిచి…

1999 లో తండ్రి బుడ్డా వెంగల్ రెడ్డిని అతికిరాతంగా చంపడం, అప్పట్లో టీడీపీ గాలి విస్తుండడంతో ఆయన కుమారుడు బుడ్డా సీతారామరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఏరసు ప్రతాపరెడ్డి పై విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల 2010 సంవత్సరంలో హైదరాబాదులో ఆయన తుది శ్వాస వదిలారు.. అయితే 2004 జరిగిన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బుడ్డా శైలజ పై, 2007లో అసెంబ్లీల పునర్విభజన అనంతరం 2009 లో శ్రీశైలం నియోజకవర్గం (శ్రీశైలం, ఆత్మకూరు వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది ) నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై ఏరాసు ప్రతాపరెడ్డి విజయం సాధించి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

2014 నుంచి పుంజుకున్న బుడ్డా రాజన్న..

బుడ్డా రాజశేఖర్ రెడ్డిఅనే పేరు కంటే రాజన్న అంటే శ్రీశైలం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సుపరిచతమే. భూమ నాగిరెడ్డి అండ తో మొదట టిడిపి తర్వాత వైఎస్ఆర్ సీపీలో చేరి 2014లో శిల్పా చక్రపాణిరెడ్డిపై గెలుపొందారు. కొన్ని అనివార్య రాజకీయ కారణాలవల్ల భూమా నాగిరెడ్డి తోపాటు బుడ్డ రాజశేఖర్ రెడ్డి తిరిగి టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి చేతిలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. 2019లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల చివరి సమయంలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి చేతులెత్తేయడంతో టిడిపి అధిష్టానం ఒక్కసారిగా ఆవక్కాయింది. అప్పట్లో ఈ వార్త పై రాజన్న అనారోగ్య కారణాలు చెప్పినప్పటికీ, కేవలం డబ్బుల కోసమే రాజన్న చేతులెత్తేశాడు అనే విషయం నియోజకవర్గంలో చర్చనియంశంగా మారింది. దీంతో టిడిపి అధిష్టానానికి బుడ్డా పై నమ్మకం పూర్తిగా కోల్పోయింది. అందుకే ప్రస్తుతం వచ్చే ఎన్నికలలో బుడ్డా రాజశేఖర్ రెడ్డిని టిడిపి అసెంబ్లీ అభ్యర్థిగా నియమించడంపై వెనుకంజా వేస్తున్నారు.

20 ఏళ్లుగా టిడిపి జెండా ఎగరని నియోజకవర్గం…

ఈ నియోజకవర్గంలో 1999లో టీడీపి, 2004,2009 లలో కాంగ్రెస్, 2014,2019లలో వైఎస్ఆర్సిపిలు గెలిచాయి. అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా టిడిపి జెండా ఎగరని నియోజకవర్గంగా శ్రీశైలం పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు దేవుని మూలైన ఈ నియోజకవర్గం పై టిడిపి అధిష్టానం పక్క ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వచ్చే ఎన్నికలలో టిడిపి జెండా ఎగరవేయాలి అంటే ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్న శిల్ప కుటుంబానికి దీటుగా కలిగిన వ్యక్తిని నియమించాలని టిడిపి అధిష్టానం భావిస్తుంది…

ఏరాసు టికెట్ ఇస్తే… బుడ్డా సపోర్ట్ చేస్తారా…?

నియోజకవర్గంలో బుడ్డాతో పాటు ఏరాసు ప్రతాపరెడ్డికి కూడా మంచి ఓటు బ్యాంకింగ్ కలదు. గుర్తించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఒకే గుటికి చేర్చారు. ఇద్దరు కలిసినప్పటికీ 2019లో జగన్ గాలి ప్రభావంతో శిల్ప చక్రపాణి రెడ్డి గెలుపొందారు. ఈసారి వచ్చే ఎన్నికలలో శిల్పాను డీ కొనాలంటే ఆర్థికంగా, బలంగా ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డికి టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చారు టీడీపీ పెద్దలు. అయితే అయన కు టికెట్ ఇస్తే బుడ్డా రాజన్న సపోర్ట్ చేస్తారా.. టికెట్ రాలేదని మనోవేదంతో రాజకీయాలు చేసి ఏరాసును ఒడిస్తారా అనే ఆలోచనలో పడ్డారు. ఒకవేళ బుడ్డా కు టికెట్ ఇస్తే ఏరాసు సపోర్ట్ చేస్తారా.. చేయరా అనే సందిగ్ధత లో వుంది టీడీపీ అధిష్టానం.. శ్రీశైలం వైఎస్ఆర్సిపి అభ్యర్థిని కూడా మార్చే ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. కానీ ఆ నియోజకవర్గంలో శిల్పా కుటుంబానికి కాకుండా మరొకరికి వైఎస్ఆర్సిపి టికెట్ ఇస్తే టిడిపి విజయం అభ్యర్థితో పని లేకుండా ఘనవిజయం సాధిస్తుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకోవడం విశేషం.

ఏరాసుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు…
మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాపరెడ్డికి అమరావతికి రావాలని శనివారం టిడిపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఉత్కంఠంగా ఉన్న , సాక్షాత్తు మల్లికార్జునుడు వెలసిన శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ని త్వరగా నియమించి ఉత్కంఠకు శుభం పలకాలని నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు…

-వెంకట్, తెలుగుప్రభ, నంద్యాల ప్రతినిధి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News