Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Chandrababu: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా, మాదిగలకు న్యాయం చేస్తా

Chandrababu: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా, మాదిగలకు న్యాయం చేస్తా

నందికొట్కూరు పర్యటనలో మాదిగ ప్రజలకు చంద్రబాబు హామీ

సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మాజీ సీఎం టిడిపి నేత చంద్రబాబు నాయుడు నందికొట్కూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పటేల్ సెంటర్ లో టిడిపి చేపట్టిన బహిరంగ సభలో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ్ రాజ్ మాదిగ, విజ్జి మాదిగల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కొరకు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనునది మాదిగ ప్రజల ఆకాంక్షని, తాను నాడు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఎంతమంది మాదిగ ప్రజలు ఉద్యోగ అవకాశాలు పొందారన్న విషయాన్ని గుర్తు చేశారు. మాదిగల ఆకాంక్ష మేరకు తాను చేసిన ఎస్సీ వర్గీకరణకు నేటికీ టిడిపి పార్టీ కట్టుబడి ఉందని, అధికారంలోని తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీపై ఎంఆర్పిఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శనలో నందికొట్కూరు నియోజవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించిన ప్రసంగంలో టిడిపి పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని, బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలకు భరోసా కల్పించారు. అదే సందర్భంలో నియోజవర్గంలో వైసీపీ పార్టీలో దళిత ఎమ్మెల్యేకు సరైన ప్రాధాన్యత లేదని విమర్శించడంపై పట్టణ ప్రజల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. ఎస్సీ రిజర్వ్ అయిన నందికొట్కూరు నియోజకవర్గం లో దళిత నాయకులకు వివిధ పార్టీల్లో తగిన ప్రాధాన్యత లేకపోవడం ఇదివరకే పట్నంలో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడు పర్యటనలో వైసిపి పార్టీ లో ఎమ్మెల్యే దళితునికి ప్రాధాన్యత లేదని విమర్శించడంపై, టిడిపిలో దళిత నాయకులకు ప్రాధాన్యత లేదన్న విషయం చంద్రబాబుకు కనబడడం లేదా అంటూ ప్రజలు మేధావులు ప్రశ్నించేలా అవకాశం చోటు చేసుకోంది. చంద్రబాబు రోడ్ షోలో ఆయన పక్కన రెడ్డి సామాజిక వర్గ నేత శివానందరెడ్డి అంతా తానే అన్నట్లు వ్యవహరించారు. టిడిపిలో కూడా దళితులకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత లేదు అని చెప్పకనే చాటి చెప్పారని పలువురు రాజకీయ విశ్లేషకులు మరియు మేధావులు చర్చించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News