రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు’ గా ( అడ్వయిజర్ టు గవర్నమెంట్ ఆన్ అగ్రికల్చర్ అఫైర్స్) ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో వీరు 5 ఏండ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది.
కాగా…విద్యాధికుడైన డా. చెన్నమనేని రమేశ్ బాబు, జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి (Humboldt University Of Berlin) ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’ లో పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాను పొందారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో…పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్ గా, వీరికి అగ్రికల్చర్ ఎకానమి’ అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రికి సలహాదారుగా వ్యవహరించనున్నారు.
Chennamaneni Ramesh: వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేని రమేష్
కేసీఆర్ వ్యవసాయ సలహాదారుగా రమేష్