Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Chevella: కాంగ్రెస్ తోనే పేదవాడికి న్యాయం

Chevella: కాంగ్రెస్ తోనే పేదవాడికి న్యాయం

ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తా

చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రజలు భీమ్ భరత్ కు హారతులు పడుతుండగా, మరోవైపు పలు పార్టీల నాయకులు భీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పే పార్టీ కాదు అని. ఆనాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఇచ్చిన తెలంగాణను అప్పులపాలు చేసి కెసిఆర్ కుటుంబం ఎదిగేందుకు స్వార్థానికి వాడుకుందే తప్ప సామాన్య ప్రజానీకానికి చేసింది ఏమీ లేదని అన్నారు. మాటలతో మోసం చేసే బీఆర్ఎస్ ని నమ్మవద్దని, మాట తప్పని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తుందన్నారు. టిపిసిసి నాయకులు శాబాద్ దర్శన్, నేను నాడు ప్రజా క్షేమం కోసమే పోరుదారి పట్టామని, నేడు అదే ఉద్యమస్ఫూర్తితో చేవెళ్ల ప్రజానీకానికి సేవ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డానని మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పేదవాడికి సమన్యాయం జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం అన్నారు. మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రజలు నన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తే ప్రజా పాలన అంటే ఏమిటో చేసి చూపిస్తానని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి పామేన భీమ్ భరత్ అన్నారు.
మొయినాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా తోల్కట్ట, ఎత్పార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, శ్రీరాంనగర్, సురంగల్, ముర్తాజగూడా, అమ్డాపూర్ తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గౌండ్ల నిరంజన్ గౌడ్ నక్కలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌరీ రవి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గుత్తి బాలరాజ్ మరో 50 మంది భీమ్ భరత్ చేతుల మీదుగా పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యాక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల అధ్యక్షులు, ఎంపీటీసిలు, సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News