Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Chevella: ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్న మందకృష్ణ

Chevella: ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్న మందకృష్ణ

కాంగ్రెస్-బిఆర్ఎస్ లు మాదిగలకు బద్ద వ్యతిరేకం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించుకోవడం ద్వారానే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మాదిగ ఉప కులాల సదస్సు కె జి ఆర్ గార్డెన్ చేవెళ్లలో ఎం ఎస్ పి మహాజన సోషలిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రావుగల్ల బాబు మాదిగ అద్యక్షతన నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ…. కమాదిగలను రాజకీయ పార్టీలు పట్టించుకోక అన్యాయం చేశాయన్నారు. ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని గుర్తించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగల కోసం హైదరాబాద్ సభకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీలో భాగంగానే సుప్రీం కోర్టు విచారణలో వర్గీకరణను బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపించారన్నారు. అలాగే కేంద్ర క్యాబినేట్ సెక్రటరి రాజీవ్ గోబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి వర్గీకరణ ప్రక్రియకు ప్రధానమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అంతిమ దశకు చేరుకుందన్నారు. మాదిగ బిడ్డలు బిజెపి అండగా ఉండి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. మోడీ చొరవను కిషన్ రెడ్డి కృషిని మాదిగ జాతి మరువద్దన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంట్లోనొల్ల నర్సింహ మాదిగ
కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రావు మాదిగ ఎం ఎస్ పి రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.మల్లికార్జున్ మాదిగ ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News