చేవెళ్ళ కె.వి.ఆర్ గ్రౌండ్లో జరిగిన ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సభలో 12 అంశాలను చదివి వినిపించారు. మొదటగా ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ. అంబేద్కర్ అభయాసం. ప్రైవేట్ సెక్టార్లో ప్రత్యేక రిజర్వేషన్లు. ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం. కాంగ్రెస్ పంచిన అసైన్డ్ భూముల పునరుద్ధరణ. అందరికీ సమాన హక్కులు. పోడు భూములకు పట్టాల పంపిణీ. సమ్మక్క సారలమ్మల గిరిజన గ్రామాభివృద్ధి పథకం. 3ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు 3ఎస్టీ కార్పొరేషన్ లో ఏర్పాటు. 5 కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలు. విద్యాజ్యోతిల పథకం. ప్రతి మండలానికి ఒక గురుకులాలు ఉండే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొందేందుకు విదేశాల్లో విద్య. 12 అంశాలపై ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో వెల్లడించారు. ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాల తెచ్చి దొరల జమీందారుల నుంచి భూములు తీసుకుని పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈసీఐఎల్ బిడిఎల్ హెచ్ సి ఎల్ ఐఐటి లాంటి పెద్ద పెద్ద జాతీయ సంస్థలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. దేశంలో నిర్మించిన తాగునీరు సాగునీటి ప్రాజెక్టులు నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి చెల్లించలేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిందన్నారు. చిన్నాచితక పథకాలు ప్రవేశపెట్టి అంతా మేమే చేశామని కెసిఆర్ ప్రజలను ప్రలోభ పెడుతుండన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల సెంటిమెంట్ అని ఇక్కడ ఏ కార్యం తలపెట్టిన విజయవంతమవుతుందన్నారు. నిజాం రజాకర్లు పాలనలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి విముక్తి కలిగించి హైదరాబాద్ ను భారత దేశంలో విలీనం చేసిన ఘనత కాంగ్రెస్ దన్నారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ వాదాన్ని తొలిసారిగా వినిపించారన్నారు. స్వర్గీయ ప్రజాయుద్ధనౌక 1996లో జననాట్య మండలిని ఏర్పాటు చేసి గజ్జ కట్టి ఊరురా తిరిగి తెలంగాణ వాదాన్ని బలపరిచారన్నారు. కెసిఆర్ మంత్రివర్గంలో ముగ్గురికి మాత్రమే స్థానం కల్పించడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులలో ముదిరాజులకు టికెట్ కేటాయించకపోవడం మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బడుగు బలహీన వర్గాలను విస్మరించార అనడానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నేలకొరిగింది ఎక్కువమంది ఎస్సీ ఎస్టీ గిరిజనులే అన్నారు. ప్రాణహిత చేవెళ్ల గోదావరి జలాలు తేకపోవడం చేవెళ్లకు తీరని అన్యాయం చేశారన్నారు. సభా వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాన అంశాలను ప్రకటించారు. మొదటిది స్వేచ్ఛయుత తెలంగాణ. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అంటూ… మూడు అంశాలను ప్రకటించారు. విద్య వైద్యం ఉద్యోగంకురబడిందన్నారు. రాష్ట్రానికి వైన్స్ షాపులు వేదిక అయినయన్నారు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత ఒప్పందంతో ఏకమయ్యాయి అన్నారు. బిజెపి పాలనలో ప్రజల బాధలను చూసి వారి బాధలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారన్నారు. తద్వారా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో విజయం సాధించామని తెలంగాణ రాష్ట్రంలో మూడవ విజయం సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుక చౌదరి గడ్డం ప్రసాద్, రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్, మల్లురవి, కేఎల్ఆర్ సున్నపు రాజయ్య, పొన్నం ప్రభాకర్ సంపత్ కుమార్, మధుయాష్కి గౌడ్, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ పొన్నం లక్ష్మయ్య, సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వి హనుమంతరావు, జగ్గారెడ్డి, డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, సున్నపు వసంతం, భీం భారత్ దర్శన్ చింపుల సత్యనారాయణ, సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, మధుసూదన్ గుప్తా, యాలాల మహేశ్వర్ రెడ్డి, దేశమళ్ల ఆంజనేయులు, వీరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ జూకన్న గారి శ్రీకాంత్ రెడ్డి, గుండాల రాములు మద్దెల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి యాదయ్య సురేష్ చాన్ పాషా రఫిక్, వివిధ నియోజకవర్గాలు, మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.