మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రముఖ సినీ హీరో చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్ యోగక్షేమాలను చిరు అడిగి తెలుసుకున్నారు. యశోద దవాఖానకు చేరుకున్న చిరంజీవిని కేసీఆర్ ఉన్న రూమ్ కు కేటీఆర్ తోడ్కొని వచ్చారు. నమస్కారం చేస్తూ కేసీఆర్ బెడ్ దగ్గరికి చేరుకుని పరామర్శించారు.
కాసేపు ఇరువురి నడుమ ఇష్టాగోష్టి జరిగింది. కేసీఆర్ ను ఉత్తేజ పరిచే సంభాషణను కొనసాగించిన చిరంజీవి త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు. అక్కడే ఉన్న డాక్టర్లను వివరాలు అడిగితెలుసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తామని తెలిపిన డాక్టర్లు ఎనిమిది వారాల్లోగా సాధారణ స్థితికి వస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ లను పరామర్శించిన చిరంజీవి అక్కడేవున్న పలువురు బీఆర్ఎస్ నేతలతో కాసేపు మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు.