ఇచ్చిన మాటను నిలుపుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఇప్పుడు చొప్పదండిలో హాట్ టాపిక్ గా మారారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం వన్నారం గ్రామంలో శుక్రవారం నాడు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. ప్రచారంలో భాగంగా గ్రామ పరిధిలోని సుద్దాలపల్లికి చెందిన మమత (నేతకాని) అనే మహిళ తన ఇంటికి రావాలని కోరింది.
ప్రచార సభలోనే మమత ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం మమత ఇంటికి వెళ్లి భోజనం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రవిశంకర్ కు ఇష్టమైన నాటుకోడి కూరతో భోజనం ఏర్పాటు చేయడంతో గ్రామ సర్పంచ్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు ఆమె ఇంటికి వెళ్లి భోజనం చేశారు.
ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తన ఇంటికి రావడం పట్ల మమత ఆశ్చర్యపడ్డది. చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా ఎమ్మెల్యే ఇంటికి రావడం పట్ల ఆశ్చర్యపడ్డారు. ఏ ఎమ్మెల్యే కూడా వారి పల్లెకు రాలేదని మా పల్లెకు రావాలంటే చాలా ఇబ్బందులు పడతారని మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నదని మహిళలు అన్నారు. పల్లె అంతా కూడా ఎమ్మెల్యే రవిశంకర్ కలియ తిరిగారు.
మామయ్య మా మొదటి ఓటు మీకే…
నూతన యువ ఓటర్లు జాడి కళ్యాణి, బౌతు నితీష, దుర్గం మౌనికలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వారు తమ మొదటి ఓటును కారు గుర్తుకు ఓటు వేస్తామని అన్నారు.