Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్CM Revanth congratulates CBN: ఫోన్లో చంద్రబాబుకు కంగ్రాట్స్ చెప్పిన రేవంత్

CM Revanth congratulates CBN: ఫోన్లో చంద్రబాబుకు కంగ్రాట్స్ చెప్పిన రేవంత్

ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు.

- Advertisement -

గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రాంచంద్ర నాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad