అదానీ కుంభకోణంపై విచారణ చేయాలని గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీని ముందు వరసలో నిలిచి ర్యాలీని లీడ్ చేసిన మంత్రులు సీతక్క, పొన్నం, జూపల్లి. సత్యమేవ జయతే పోస్టర్ చేతబట్టి ఈ డీ ఆఫీస్ వరక ర్యాలీ చేపట్టిన మంత్రి సీతక్క. ఈడీ కార్యాలయం ముందు బైఠాయించిన మంత్రులు సీతక్క, పొన్నం, జూపల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
అదానీ కుంభకోణంపై జేపిసి వేయాలి, సెబీ చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్, దేశం కోసం, సత్యం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని నినదించిన సీతక్క.
మీడియాతో సీతక్క..
“నల్లదనం తెచ్చి ప్రజలకు పంచుతామని చెప్పిన బిజెపి, దేశ సంపదను విదేశాలకు తరలించేలా సహకరిస్తుంది, అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయాల్సిన సెబి పెద్దలే పెట్టుబడులు పెట్టారన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఇది కంచే చెను మేసినట్టుగా ఉంది, అన్ని వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది, బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదానీ అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, అప్పుడే నిజాలు బయటకు వస్తాయి, జేపీసీ వేయడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోంది, నీతిమంతులం అని చెప్పుకునే.. బిజెపి కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు పేదలవుతున్నారు, అదానీ ఆస్తులు వేయి రేట్లు పెరిగాయి, అదానీ స్కాం పై టిఆర్ఎస్ ఎందుకు మౌనంగా వుంది, బిజెపి మెప్పుకోసమే టిఆర్ఎస్ పాకులాడుతుoది, జైల్లో ఉన్న తమ ఆడబిడ్డను కాపాడుకోవడానికి బిజెపి ముందు టిఆర్ఎస్ మోకరిళ్ళుతోంది, అదానీ స్కాం పై జేపీసీ వేసేదాకా పోరాటం కొనసాగిస్తాం” అని సీతక్క అన్నారు.