Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్Court: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంతోష్ విచారణపై స్టే పొడగింపు

Court: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంతోష్ విచారణపై స్టే పొడగింపు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ కు ఊరట దొరికింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌పై సిట్ విచారణపై స్టే పొడగించింది కోర్టు. జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లపై సిట్ విచారణపై కూడా స్టే పొడిగించటం విశేషం. బీఎల్‌ సంతోష్ సహా నలుగురికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై స్టే ఇచ్చిన కోర్టు ఈనెల 23 వరకు స్టే గడువు పొడిగించింది. గతంలో ఇచ్చిన హైకోర్టు స్టే గడువు డిసెంబరు 30తో ముగిసింది. సీబీఐ విచారణకు ఆదేశించినందున సిట్ విచారణపై స్టే పొడిగించడమెందుకని హైకోర్టు అభిప్రాయపడింది. తీర్పు ప్రతి ప్రభుత్వం తీసుకొనే వరకు అమలు సస్పెన్షన్ లో ఉంటుంది కాబట్టి స్టే పొడిగించాలన్న పిటిషనర్ల న్యాయవాది వాదించారు. ప్రభుత్వ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ సర్కారు హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad