Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్..!

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్..!

CP Radhakrishnan: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రుల సమక్షంలో నామినేషన్ వేశారు. వారి సమక్షంలోనే రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాలుగు సెట్ల పేపర్లు దాఖలు చేశారు. తొలి సెట్‌కు చీఫ్ ప్రపోజర్‌గా ప్రధాని ఉన్నారు. కాగా.. నామినేషన్ దాఖలు చేయకముందు ప్రేరణా స్థల్‌ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి సీపీ రాధాకృష్ణన్ నివాళులర్పించారు. నామినేషన్ వేసిన తర్వాత సీపీ రాధాకృష్ణన్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసారు. నామినేషన్ పత్రాల దాఖలుకు మంత్రులు, ఎన్డీయే నేతలతో కలిసి వెళ్లామని, ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ వన్నెతెస్తారని, దేశం మరింత ప్రగతి పథంలోకి వెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Read Also: Innovation Andhra: గిన్నీస్ రికార్డులకెక్కిన ‘ఆవిష్కరణ ఆంధ్ర’

ఎన్నిక ఎప్పుడంటే?
సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల జరగనుండగా.. దీన్ని ఏకగ్రీవం చేయాలని అధికార ఎన్డీఏ కూటమి తహతహలాడుతోంది. కానీ, విపక్ష ‘ఇండియా’ కూటమి ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

Read Also: Scuba diver: శివమణి సినిమా స్టోరీ రిపీట్.. కాకపోతే ట్విస్ట్ అదుర్స్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad