Thursday, November 21, 2024
Homeపాలిటిక్స్Danam to return to Cong: ఎట్టకేలకు సొంత గూడు కాంగ్రెస్ కే రానున్న...

Danam to return to Cong: ఎట్టకేలకు సొంత గూడు కాంగ్రెస్ కే రానున్న దానం

కాంగ్రెస్-టీడీపీ-కాంగ్రెస్-టీఆర్ఎస్-కాంగ్రెస్..ఇది దానం కెరీర్

దానం నాగేందర్ .. గుర్తున్నాడా? గుర్తుండే ఉంటాడులెండి. ఎంతైన సీనియర్ నేత, పైగా హైదరాబాద్ లో ప్రముఖ రాజకీయవేత్తగా గతంలో వెలిగినవాడు..అంతకంటే ఎక్కువ ఏంటంటే.. మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిన లీడర్ కదా అంటారా? నిజమే. అదేంటో కానీ దానం నాగేందర్ కాంగ్రెస్ లో బ్రహ్మాండంగా ఎదిగారు, కానీ పార్టీ వీడాక అందునా గులాబీ కండువా కప్పాకున్నాక పాపం మరీ గుంపులో గోవిందలా తయారయ్యారు కానీ ఓన్ ఐడెంటిటీ, పదవులు, అధికారం లాంటివేవీ లేక జనం మధ్యనే ఉంటూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ కూడా అజ్ఞాతంలో ఉన్నట్టే రాజకీయ జీవితం నెట్టుకురావాల్సి వచ్చింది.

- Advertisement -

దానం ఘర్ వాపసి

అందుకే కాంగ్రెస్ సర్కారు కొలువు తీరగానే దానం కాంగ్రెస్ గురించి సీరియస్ గా ఆలోచించటం మొదలుపెట్టారు. అంతేకాదు ఘర్ వాపసీకి పెట్టాబేడా సర్దేసుకుని నయా జోష్ తో మళ్లీ వచ్చేశారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా దానం అనుచరుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. అంతేకాదు గాంధీభవన్ పెద్దలు కూడా హమ్మయ్యా అనేలా చేశారని చెప్పాలి..ఎందుకంటే ఎంతైనా హైదాబాద్ లో దానంను మించిన క్రౌడ్ పుల్లర్, మాస్ అప్పీల్ ఉన్న మరో కాంగ్రెస్ నేత లేరనే చెప్పాలి. కానీ చూడాలి మరి దానంకు గతంలో ఇచ్చినంత బాధ్యతలు, ప్రాధాన్యతలు రేవంత్ కట్టబెడతారా లేదా అని.

ఎన్టీఆర్ భవన్ టు గాంధీభవన్, తెలంగాణ భవన్ టు గాంధీభవన్..

ఎంతైనా దానం కూడా ఓ స్టాప్ గ్యాప్ అరెంజ్మెంట్ లా కొంతకాలం టీడీపీలో ఉండి ఎన్టీఆర్ భవన్ నుంచి మళ్లీ గాంధీ భవన్ వచ్చినవారే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక గాంధీభవన్ లో దానం పప్పులు ఉడుకుతాయా, అసలు మిగతావారు ఉడకనిస్తారా తెలియట్లేదు. జస్ట్ తెలంగాణ భవన్ నుంచి వస్తేచాలు గాంధీభవన్ లో వెయిటేజీ ఇస్తారనుకునే పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు. ఈ విషయంగా దానంకు బాగా తెలుసు.

రేవంత్ తో భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన దానంతో పాటు ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విష్ణు నాథ్, మన్సూర్ అలీఖాన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News