గాంధీ భవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.. మనం కస్టపడి పని చేస్తే పార్లమెంట్ ఎన్నికలలో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని దీపా అన్నారు.
అధికార ప్రతినిధుల బాధ్యత చాలా ఉంది. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం.. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీస్కెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలన్న దీపాదాస్, బీజేపీ, బిఅర్ ఎస్, ఎం ఐ.ఎం చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీ చేస్తున్న మతతత్వ రాజకీయలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. బీజేపీ తెలంగాణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని, కొన్ని నియోజక వర్గాలలో వారు ఇప్పటికే లోతుగా పనులు చేస్తున్నారు కాబట్టి మనం అలెర్ట్ గా ఉండాలన్నారు.
రాష్ట్రంలో మన పార్టీ గెలవగానే కొంచం విశ్రాంతిలో నేతలు ఉంటున్నారు కానీ పార్లమెంట్ కోసం మళ్ళీ పెద్దఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని ఆమె హితబోధ చేశారు. దేశంలో కాంగ్రెస్ కు తెలంగాణ నుంచి అత్యంత బాధ్యత ఉందని, మనం కష్టపడి మరింత మంచి ఫలితాలు అందించాలన్నారు.