Tuesday, September 10, 2024
Homeపాలిటిక్స్Dep CM Bhatti travel in tractor to review floods situation: ట్రాక్టర్ ఎక్కి...

Dep CM Bhatti travel in tractor to review floods situation: ట్రాక్టర్ ఎక్కి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యుటీ సీఎం భట్టీ

ట్రాక్టర్ ఎక్కి ప్రయాణించి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. మీనవోలు నుంచి పెద్ద గోపారం వరకు ట్రాక్టర్ ఎక్కి వరద ఉధృతిని పరిశీలించిన డిప్యూటీ సీఎం. వాగులో గల్లంతై మృతి చెందిన సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం.

- Advertisement -

అత్యంత క‌ఠిన ప‌రిస్థితుల మధ్య ట్రాక్టర్ ఎక్కి ప్రయాణించి ఎర్రుపాలెం మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆదివారం రాత్రి పర్యవేక్షించారు.‌
మీనవోలు- పెద్ద గోపవరం గ్రామాల మధ్యన కట్టలేరు పొంగి పొర్లి రోడ్డు పైన వరద నీరు ప్రవహించడంతో మీనవోలు హనుమంతుని వాగు వద్ద  ట్రాక్టర్ ఎక్కి పెద్ద గోపవరం వైపు వెళ్లి డిప్యూటీ సీఎం పరిస్థితిని సమీక్షించారు. శనివారం వాగులో గల్లంతై మృతి చెందిన భవానిపురం గ్రామానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలిపారు. పెద్ద గోపారం భీమవరం, భవానిపురం లో పరిస్థితులను సమీక్షించారు. ఆ తరువాత అయ్యవారి గూడెంకు చేరుకొని ఇటీవల హైదరాబాద్ లో మృతి చెందిన మొండ్రు ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News