Friday, November 22, 2024
Homeపాలిటిక్స్White paper on electricity: విద్యుత్ రంగంపై శ్వేత పత్రం

White paper on electricity: విద్యుత్ రంగంపై శ్వేత పత్రం

కేసీఆర్ సర్కారు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదంతే-భట్టీ

అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసింది తెలంగాణ సర్కారు. ఈమేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన భట్టి విక్రమార్క కామెంట్స్ ఇలా ఉన్నాయి.

- Advertisement -

విద్యుత్ రంగంలో ఆర్ధిక అరాచకం సృష్టించారు. విద్యుత్ శాఖ మొత్తము అప్పు 81,516 కోట్లు

విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల నుండి 28 వేల కోట్ల రూపాయల బిల్లుల రావాలి

2014 నాటికి విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల బకాయిలు కేవలం 1595.37 కోట్లు మాత్రమే

28 వేల కోట్ల బకాయిల్లో సాగునీటి శాఖ
14,193 కోట్లు చెల్లించాలి

మిషన్ భగీరథ విద్యుత్ బకాయిలు 3558 కోట్లు.

డిస్కంలు అప్పుల్లో కూరుకు పోయాయి

డిస్కంలు 35,227 వేల కోట్ల అప్పులు పెరిగాయి

2014 నాటికి జెన్కోలో అప్పు 7,662కోట్ల రూపాయలు ఉండగా 10 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో 32,797 కోట్ల అప్పులు పెరిగాయి.

వ్యవసాయంకి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది

విద్యుత్ రంగం లో తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు సలహాలు ఇవ్వండి

బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఏ రోజు ఇవ్వలేదు.

జగదీష్ రెడ్డి గారు గొంతు తెర్చు కొని అరిస్తే అబద్ధాలు నిజం కావు. 24 గంటల కరెంటు మీ ప్రభుత్వం
ఏ రోజు ఇవ్వలేదు

సభను తప్పుదోవ పట్టించే విధంగా జగదీష్ రెడ్డి పదే పదే 24 గంటల కరెంటు ఇచ్చామని చెప్పడం సరికాదు

24 గంటల కరెంటు మీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నాం. దీన్ని ఒప్పుకోకుండా బిఆర్ఎస్ సభ్యులు సభలో గోల చేయడానికి ముందుకు దూసుకు వస్తే ఇక్కడ ఎవరు భయపడరు. మీ ప్రవర్తన సభకు శోభ ఇవ్వదు. గౌరవం ఇవ్వదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News