Wednesday, April 2, 2025
Homeపాలిటిక్స్Dharmavaram: సత్యకుమార్ కు హారతులు పడుతున్న స్థానికులు

Dharmavaram: సత్యకుమార్ కు హారతులు పడుతున్న స్థానికులు

అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుని..

ధర్మవరం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు పట్టణ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. సత్యకుమార్ యాదవ్ తొలుత 11 వార్డులోని మార్కండేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజను నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 13 ,15 23 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డులలోని ప్రజలు మంగళ హారతులతో సత్య కుమార్ కి స్వాగతం పలికారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, తాను ఎమ్మెల్యే అయ్యాక వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సత్యకుమార్ యాదవ్.

- Advertisement -

ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే పథకాలను కూడా వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News