శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా పరిధిలోని దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీల పనితీరుతో పాటు వ్యక్తిగతంగా అభ్యర్థులను, సైతం అన్ని కోణాలలో ఆలోచిస్తున్నారు. గెలుపు ఓటములపై ఆయా పార్టీల స్థానిక నాయకుల ప్రభావం ఎంతో కొంత ప్రభావం ఉండక తప్పదు. పార్టీలలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి నేతలను గమనించి అభ్యర్థులు వారిని ఏదోరకంగా తన దారికి తెచ్చుకోకపోతే గెలుపు కష్టమే అనే చర్చ జరుగుతోంది. పైకి కండువాలు వేసుకొని జై జై అన్నంత మాత్రాన తన వారే అనుకునే అభ్యర్థి ఓటమి పాలవ్వడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బి జే పీ, బి ఆర్ ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
* కేంద్ర ప్రభుత్వం పథకాలు, మోడీ పనితీరుతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆదరణ లభిస్తోంది. వ్యక్తిగతంగా ప్రశ్నించే గొంతుకగా ప్రజలు ఆదరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నా పనిచేయించే దమ్మున్న నాయకుడుగా ముచ్చటిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఆయన గెలుపుతోనే భయనికో భక్తికో అంతో ఇంతో నియోజకవర్గంలో అభివృద్ధి అయిందనే చర్చ సాగుతోంది.
* కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంది.అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా సున్నితత్వం , స్వభావశీలిగా ఎదుటి వారికి కీడు చేయడు అనే మంచి మనిషిగా ఉన్నప్పటికీ రాజకీయ ఎత్తుగడలు వేయడంలో అంతంతమాత్రంగానే అనే ముచ్చట్లు ఉన్నాయి. కేసీఆర్ పథకాలు అభ్యర్థి మంచితనం జోడుకావడం వల్ల గట్టి పోటీ పడనున్నారు.
* కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికి ఎవరో తెలియక పోవడంతో నేనంటే నేను అంటూ టికెట్ ఆశిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కత్తి కార్తీక, శ్రవణ్ కుమార్ రెడ్డి పేర్లు వినబడుతున్నప్పటికి వీరిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ ఖరారు అయితే అంతో ఇంతో గట్టి పోటీలో ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయి.నియోజకవర్గానికి అభివృద్దే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కావడంతో ఆయనకే టికెట్ ఖరారు చేస్తే గట్టిగా ప్రయత్నం చేస్తే నియోజకవర్గంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటున్నట్లు ఉంటుందనే చర్చ జరుగుతోంది.