Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Warangal: మాధవ రెడ్డి వల్ల నాకు టికెట్ రాలేదు

Warangal: మాధవ రెడ్డి వల్ల నాకు టికెట్ రాలేదు

దొంగలకు టికెట్లు కేటాయించిన కాంగ్రెస్

నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన రాజకీయం వల్లనే తనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్టు రాలేదని మాజీ డిసిసిబి చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని, విద్యార్థులను కొట్టించిన దాస్యం వినయ్ భాస్కర్ కు గుణపాఠం చెప్పాలని, యూనివర్సిటీ భూములను అమ్ముకున్న నాయిని రాజేందర్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక అసమర్ధునికి టికెట్ ఇచ్చిందని, ఇందిరమ్మ ఇండ్లు అమ్ముకున్న ఒక అసమర్ధునికి టికెట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నా సేవలను గుర్తించలేకపోయినను నేను ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ నుండి పోటీలో ఉండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి సింహం గుర్తుపై గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ముగ్గురు ఎంపీలతో పార్లమెంట్ సమావేశంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని తీసుకొచ్చిన ఘనత నాదన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రాజీనామా పత్రం జేబులో ఉందని చెప్తాడు గానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు.

- Advertisement -

నాకు ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచే సత్తా ఉంద‌ని, త‌ప్ప‌కుండా గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చనిపోయేంతవరకు నేను కాంగ్రెస్ పార్టీ అభిమానినే అని అన్నారు. త‌న‌ను ఆద‌రించి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గెలిపిస్తే త‌న సొంత నిధులతో 50 కోట్ల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మిస్తాన‌న్నారు. ప్ర‌తి డివిజ‌న్‌లో క‌మ్యూనిటీ హాల్ క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. కాజీపేటలో ఉన్నటువంటి ఐదు డివిజన్లలో మినీ ఫంక్షన్ హాల్లు కట్టిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అన్నారు. వ‌ర్షం ప‌డితే రోడ్ల‌న్నీ మునుగుతున్నాయ‌ని, ఈ స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తాన‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, జంగా అభిమానులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News