Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Election Commission: కేజ్రీవాల్ ఫుల్ ఖుష్, దీదీ, పవార్ షాక్!

Election Commission: కేజ్రీవాల్ ఫుల్ ఖుష్, దీదీ, పవార్ షాక్!

ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కింది. దీంతో ఆప్ లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది.  ఇటు పాత ప్రాంతీయ పార్టీలు మాత్రం డీలా పడ్డాయి.  తృణముల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు జాతీయ హోదా దక్కకపోవటం శరద్ పవార్, మమతా బెనర్జీకి బేజారు చేయిస్తున్నాయి.  అసలే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు పవార్, దీదీ గొంతులో ఎన్నికల కమిషన్ పచ్చి వెలక్కాయ వేసినట్టైంది.  ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో ఆప్ సాధించిన ఓట్ల శాతం  ఆధారంగా కేజ్రీవాల్ పార్టీకి జాతీయ హోదా దక్కినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.  కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఉంటేనా అది జాతీయ పార్టీగా అర్హత సాధిస్తుందని ఎన్నికల కమిషన్ వివరిస్తోంది.

- Advertisement -

కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఐ కూడా ప్రాంతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తూ జాతీయ హోదా రద్దు చేయటం విశేషం.  కనీసం నాలుగు రాష్ట్రాల్లో అయినా లోక్ సభ ఎన్నికల్లో 2శాతం ఓట్లు సాధిస్తేనే జాతీయ పార్టీ అవుతుందనే విషయాన్ని ఈసీ తెలిపింది.  అయితే ఒక్కసారి ఏదైనా పార్టీకి జాతీయ హోదా రద్దైతే తమ అభ్యర్థులు వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకు కామన్ సింబల్ దొరకదు.

దీంతో తాజాగా మొత్తం 6 పార్టీలు జాతీయ హోదా దక్కించుకుని ఈ జాబితాలో చోటు సంపాదించాయి. అవి.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐఎం, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ ప్యూపుల్స్ పార్టీ, ఆప్ మాత్రమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News