Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్Gajularamaram: వివేక్ పై కూన శ్రీశైలం గౌడ్ ఫైర్

Gajularamaram: వివేక్ పై కూన శ్రీశైలం గౌడ్ ఫైర్

నిప్పులుచెరిగిన కూన..

సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. టిడిపిలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పిరాయించిన నీకు కాంగ్రెస్ నాయకులపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎన్నికల ముందు నువ్వు నాపై దాడికి వచ్చావని, నాకు సంస్కారం ఉండి నీపై తిరిగి దాడి చేయలేదన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది? నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్ లో తిరగనియ్యం అని హెచ్చరించారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News