గాంధీ భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ ఘనంగా వేడుకలు జరిగాయి..
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, అధికార ప్రతినిధులు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్, కత్తి వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు..
వేద పండితులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజల విఘ్నాలు తొలగిపోయి ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు జరిగాయి..
ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలు సంక్షేమం గురించి ఎంతో కృషి చేస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నారని అన్నారు.
ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి భావంతుడు కృప ఉండాలని విఘ్నలూ తొలగిపోయి అందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు..