Friday, April 4, 2025
Homeపాలిటిక్స్Gangula: ఎన్నికల కోసమే బండి సంజయ్, అరవింద్ దేవుళ్ళను వాడుకుంటారు

Gangula: ఎన్నికల కోసమే బండి సంజయ్, అరవింద్ దేవుళ్ళను వాడుకుంటారు

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ లు రాముడిని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని, నిజంగా ధర్మాన్ని కాపాడే వారే అయితే కొండగట్టు ఆలయ అభివృద్ధికి వంద కోట్ల నిధులు తేవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటనకు వస్తున్న సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు గంగుల. ఈ సందర్భంగా మంత్రి గంగుల మీడియా తో మాట్లాడుతూ…ఉత్తర తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అయినందున ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న కెసిఆరే అసలైన హిందూ ధర్మాన్ని కాపాడేది అని అన్నారు. సంజయ్ అరవింద్ లు రాముడి పేరు చెప్పి ఎంపిలు అయ్యారని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేలేదని, నిజంగా హిందువులు అయితే మేము ఇచ్చే నిధులకు తోడుగా100 కోట్లు తేవాలని అప్పుడే నిజమైన హిందువులుగా చూస్తాం అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News