ఎన్నిక ఏదైనా కెసిఆర్ కు అండగా నిలిచిన నగరం కరీంనగర్ అంటూ మంత్రి గంగుల ప్రెస్ మీట్ నిర్వహించారు. తనను మూడు సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు… సియం కెసిఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నానని మంత్రి గంగుల చెప్పుకొచ్చారు.
నా చేతులు బలోపేతం చేయండి… మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన ఆయన.. 9వ తేదీన తొలి నామినేషన్… 10వ తేదీన 2వ నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. బొమ్మకల్ హనుమాన్ టెంపుల్ నుండి ప్రచారం ప్రారంభిస్తామని, సిబి… ఎంఆర్ఎఫ్ లతో యూనివర్శల్ స్టూడియోగా మార్చేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటెల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. ఈటెలది దుర్మార్గాపు ఆలోచనని ఆరోపించారు. సిఎం కెసిఆర్ ఫోటోతో గెలిచి… ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటెల… ఇప్పుడు కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ ఫోటో లేకుండా గెలువగలవా అని ఈటలను నిలదీశారు.