Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్Gangula right hand in TDP: టిడిపిలోకి గంగుల అనుచరుడు

Gangula right hand in TDP: టిడిపిలోకి గంగుల అనుచరుడు

భూమా కుటుంబం సమక్షంలో టీడీపీలోకి

గంగుల కుటుంబానికి ప్రధాన అనుచరుడిగా ఎన్నో ఏళ్ల నుండి వారు ఏ పార్టీలో కొనసాగితే వారి వెంటే ఉండే దొర్నిపాడు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన గంగుల ప్రధాన అనుచరుడు వైసీపీ నాయకుడు నిమ్మకాయల వెంకటరామిరెడ్డి వైసీపీ పార్టీ వీడి తన అనుచరులతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భూమా విఖ్యాత్ రెడ్డిభార్గవ రాముడుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ భూమా కుటుంబం ప్రజలకు అన్యాయము అక్రమాలు దౌర్జన్యాలు చేసి ఉంటే గంగుల కుటుంబానికి అనుచరులుగా ఉండేవారు మా మీద నమ్మకంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీలో చేరినా చేరకపోయినా ఎవరికి అన్యాయం చేసే కుటుంబం మాది కాదన్నారు. పార్టీలో చేరిన వెంకటరామిరెడ్డి వర్గానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. అనంతరం వైసిపి నుండి టిడిపిలో చేరిన వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి భూమా కుటుంబంపైన ఉన్న అభిమానంతో చంద్రబాబు పాలన మళ్లీ రావాలని కోరుకుంటూ తన అనుచరులతో పార్టీలో చేరామన్నారు. టిడిపిలో వెంకటేశ్వర్ రెడ్డి గుర్రన్న చాంద్బాషా నాగార్జున రెడ్డి శివరాం రెడ్డి ఏసు పాదం పుల్లన్న నాగేంద్ర రహీం కొప్పు భాషతో పాటు మరికొన్ని కుటుంబాలు వైసిపి కార్యకర్తలు పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad