ఈనెల 8న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగాన పల్లె కు రానున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైకోర్టు న్యాయవాది గోగిశేట్టి నరసింహారావు, టిడిపి లో చేరుతున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనగానపల్లె లో ‘ బాబు షూరిటి – భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టేందుకు వస్తున్నారని. ఈ మేరకు క్యాకర్తలతో అభిమానులతో కలిసి భారీగా వీరారెడ్డి పల్లె నుండి వాహనాల్లో తరలివెళ్లి కలుస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్న బలిజ కులస్థులకు టిడిపి తరపున ఎంపి టికెట్ ఇవ్వాలనీ కోరనున్నట్లు చెప్పారు. కాపు, బలిజ కులస్తులకు రాజకీయాల్లో సముచిత స్థానం కలిపించాలని కోరుకుంటు రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తామని చెప్పారు._
Gogisetty to join TDP: టిడిపి చేరనున్నగోగిశెట్టి నరసింహారావు
ఈనెల8న చంద్రబాబు నాయుడు సమక్షంలో..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES