Thursday, April 3, 2025
Homeపాలిటిక్స్Golden Globes: సీఎం జగన్ Vs ఆద్నాన్ సామి

Golden Globes: సీఎం జగన్ Vs ఆద్నాన్ సామి

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ గెలిచిన ఎస్ఎస్ రాజమౌళి టీంకు ఏపీ సీఎం జగన్ ట్విట్టర్లో కంగ్రాట్స్ చెప్పగా.. దానిపై సింగర్ ఆద్నాన్ సామీ సీరియస్ గా స్పందించారు. మనమంతా ముందు ఇండియన్స్ అంటూ ఆద్నాన్ ట్వీట్ చేయటం సోషల్ మీడియాలో దుమారం రేపింది. తెలుగు జెండాను ఎగరేశారంటూ జగన్ పేర్కొనటంపై ఆద్నాన్ సామి స్పందించారు. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి మనల్ని మనం వేరుచేసుకోవటం ఏంటన్నారు. 1947లో ఇలాంటి అంశాలు ఎంత అనారోగ్య వాతావరణాన్ని తెచ్చాయో మనం చూశాం అంటూ ఆద్నాన్ పేర్కొన్నారు. అయితే ఆద్నాన్ సామీ ట్వీట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News