Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Harish Fire on Mahender Reddy chief VIP post: చీప్ విప్ గా...

Harish Fire on Mahender Reddy chief VIP post: చీప్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం

హరీష్ ట్వీట్..

చీప్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని, బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీప్ విప్ బాధ్యత అన్న హరీష్, మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అంటూ నిలదీశారు. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా అంటూ హరీష్ అన్నారు.

- Advertisement -

విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్ అన్న హరీష్, ఎదుటి పార్టీ వారిని చీప్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడని, బిఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చిందని హరీష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అంటూ పిఎసి, చీప్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బిఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ గారే చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారని గుర్తుచేశారు.

అలా చెప్పి మళ్లీ మా పార్టీ వాళ్లు కాదు అని మాట్లాడుతున్నారని, బిఆర్ఎస్ పార్టీ 38 మంది అని వాళ్లే చెప్తారు, మళ్ళీ మా వాళ్లు కాదు చెబుతారన్నారు. చైర్మెన్ గారి దగ్గర మహేందర్ రెడ్డి గారి అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉంది. ట్రిబ్యునల్ ఛైర్మన్ గా దాని మీద నిర్ణయం తీసుకోవాలన్న హరీష్, ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్ గా అదే కౌన్సిల్ చైర్మన్ బులిటెన్ ఎలా ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. ఆయన అనర్హత పిటిషన్ లో చైర్మన్ ఇచ్చిన బుల్ టెన్ ఇంప్లీడ్ చేస్తామని, మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడని, పార్టీ ఫిరాయింపు చేశాడని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

మార్చి 15 నాడు చీఫ్ విప్ అని ఆర్డర్ ఇస్తే, పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17 ఎమ్మెల్సీ గా జెండా ఎగురేస్తారని జి ఏ డి అఫీషియల్ జీవో ఎలా ఇస్తుందని, అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

పట్నం‌ మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛ్మైరన్ దగ్గర పెండింగ్ లో ఉందని, రేవంత్ హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ, పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది, అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు, పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News