Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Harish Rao: పట్టుబట్టి సాధించిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే

Harish Rao: పట్టుబట్టి సాధించిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే

100 పడకల ఆసుపత్రిగా బిచ్కుంద ఆసుపత్రి అప్గ్రేడ్

పట్టుబట్టి వంద పడకల ఆసుపత్రిని సాధించిన ఘనుడు మీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించారు. భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం బండాయప్ప కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాయాంలో ఇంతకు ముందు డయాలసిస్ సెంటర్, ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి మంజూరు అయ్యాయని, 60 ఏళ్లలో కానీ అభివృద్ధి కేవలం 10 సంవత్సరాలలో చేసి చూపించామని, అన్ని రంగాలలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో వున్నదని జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే హనుమంత్ షిండే తీవ్రంగా కృషి చేస్తున్నారని హరీష్ అభినందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

పార్టీని నడపలేని కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని నడపగలరా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బిచ్కుందలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తుందని విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లు దొంగ సర్వేలు వాట్సప్ గ్రూపుల్లో పెడుతున్నారు. ఇక బీజేపీ వాళ్లు ఢిల్లీలో అవార్డు ఇస్తూ.. గల్లీలో తిట్టిపోతున్నారు’ అని హరీశ్ మండిపడ్డారు.

KCR అంటే ఒక నమ్మకమని, KCR ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంతో బలోపేతమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని సీఎం KCR పేదలకు దగ్గరగా తీసుకొచ్చారన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉంటే ఇయ్యాల పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అన్నంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు మారాయన్నారు.ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే ఇతర పార్టీ వాళ్ళను దీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మన కార్యకర్తలదే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదర్ శోభ రాజు, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, సొసైటీ చైర్మన్ బాలు, జుక్కల్ ఎంపిపి యశోద నీళ్లు పటేల్,డోంగ్లి సొసైటీ చైర్మన్ రామ్ పటేల్, పుల్కల్ సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి,మండల అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్,బస్వరాజ్ పటేల్,ఆత్మ కమిటీ చైర్మన్ కొండా గంగాధర్, యువనాయకులు హరీష్ షిండే, జుక్కల్ నియోజకవర్గం సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, టిఆర్ఎస్ కార్యకర్తలు భారీఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News