Harish Rao: అధికారం కోల్పోయినప్పట్నుంచి బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పార్టీలో అంతర్గత విబేధాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీష్‌రావు, సంతోష్ రావు కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్‌రావు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. నిజానికి ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే లండన్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా కూతురి ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లిన హరీష్ రావు బీఆర్‌ఎస్ యూకే విభాగం నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోబోనని సన్నిహితుల దగ్గర హరీష్ చెప్పినట్లు సమాచారం. నా వల్ల BRSలో ఇబ్బంది వస్తుందనడం దింపుడు కళ్లం ఆశ -అని హరీష్ ఎద్దేవా చేశారు.ఇప్పటికి కొన్ని వందల సార్లు దీనిపై క్లారిటీ ఇచ్చానన్న హరీష్ రావు. నేను క్రమశిక్షణ గల కార్యకర్తనని హరీష్‌రావు వెల్లడించినట్లు తెలిసింది.కేసీఆర్ నాయకత్వంలో చివరిశ్వాస వరకు పని చేస్తానని స్పష్టికరించారు.పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని హరీష్ రావు తేల్చిచెప్పారు.పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో పని చేశానని, భవిష్యత్తులో కూడా పని చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.
Read Also: Supreme Court: అక్రమంగా చెట్ల నరికివేత వల్లే.. ప్రకృతి విలయంపై సుప్రీంకోర్టు
కాంగ్రెస్ పై విమర్శలు
కాగా లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కమిషన్లు, ఎంక్వైరీలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందంటూ మండిపడ్డారు. పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలన చూశాకే ప్రజలకు కేసీఆర్ విలువ తెలిసిందన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనక్కిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డలో మూడు ఫిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారు. ఏడాదిన్నరగా కాలంగా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. వానకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదన్న ఆయన ఆ సమయంలో బాహుబలి మోటర్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టెట్ కుప్పకూలిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు రావడం లేదని ఆరోపించారు.
Read Also: Luxury Yacht: ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక
హరీష్ లండన్ పర్యటన
తన కూతురును కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో హరీష్ రావు లండన్ వెళ్లారు. ఆయన కుమార్తె ఉన్నత విద్య కోసం లండన్ కు వెళ్లిన ఆయన వెంట కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్ళినట్లు తెలుస్తోంది. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత, హరీష్ రావు త్వరలోనే సమాధానం చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇప్పటికే తన సన్నిహితులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. లండన్ పర్యటన ముగించుకుని హరీష్‌రావు రేపు తిరిగిరానున్నారు. ఆయన రావడంతో నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌తో కవిత కామెంట్స్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కవితకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.


