ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు హరీష్. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది, బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందని, కెసిఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉందంటూ హరీష్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని, విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందంటూ హరీష్ మండిపడ్డారు. అధికార పార్టీ అడగదు, ప్రతి పక్షం ప్రశ్నించదంటూ ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని, అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి అది మీకే మంచిది కాదని ఆయన హెచ్చరించటం విశేషం.