Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Harish Rao on Sarpachens arrest: సర్పంచులు ఏం తప్పు చేశారు? నిలదీసిన హరీష్...

Harish Rao on Sarpachens arrest: సర్పంచులు ఏం తప్పు చేశారు? నిలదీసిన హరీష్ రావు

8పైసలు కూడా గ్రామ పంచాయతీ లకు ఇవ్వలేదు

అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా అరెస్టయి తిరుమల గిరి పోలీస్ స్టేషన్ లో ఉన్న మాజీ సర్పంచ్ లకు బీఆర్ఎస్ అండగా నిలబడింది. తిరుమల గిరి పోలీసు స్టేషన్ లో సర్పంచులను పరామర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అరెస్టయిన మాజీ సర్పంచులకు మద్దతు తెలిపిన ఎంఎల్ఏ లు హరీష్ రావు, గంగుల కమలాకర్, సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, దేశపతి శ్రీనివాస్ మద్దతుగా మాట్లాడారు.

- Advertisement -

పోలీసుల రాజ్యం రాష్ట్రంలో కనిపిస్తోందన్న హరీష్, సర్పంచులు ఏం తప్పు చేశారని సర్కారును నిలదీశారు. ప్రజలకు సేవ చేయటం తప్పా? వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారని హరీష్ రావు అన్నారు. 8 పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వలేదని, ఢిల్లి ఇచ్చిన 500 కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, జ్వరాలతో జనం బాధపడుతున్నారని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆయన ఆరోపించారు.

ప్రతి నెల 275 కోట్లు మేము మా ప్రభుత్వం లో ఇచ్చామని, పల్లె ప్రగతి డబ్బులు ఇవ్వటం లేదని, ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పథకం నుంచి వచ్చిన డబ్బులు ప్రభుత్వం దాచిందని, తమ పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా అరెస్టు చేశారని హరీష్ భగ్గుమన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News