సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు, వారికి నెలకు 15 వేల రూపాయల జీవన భృతిగా సర్కారు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ్రాండ్ అంబాసిడర్లన్న హరీష్.. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవ మర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారన్నారు.
సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శమన్నారు. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందన్న హరీష్, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టాల్సిన అవసరం లేదని, ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని హరీష్ ఈసందర్భంగా ప్రకటించి, ఆటో డ్రైవర్లకు మద్దతిచ్చారు.